మైలవరంలో హ్యాట్రిక్ సాధిస్తాం : దేవినేని ఉమ‌

by సూర్య | Fri, Mar 22, 2019, 12:18 PM

ఓటు అనే ఆయుధంలో మైలవరం నియోజకవర్గం నుంచి ప్రత్యర్థిని తరిమి తరిమి కొట్టాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. జెండాల కోసం, ఫెక్సీల కోసం మనలో మనం గొడవపడొద్దని, అల్లర్లు సృష్టించాలనే ప్రత్యర్థుల వ్యూహాలను ఛిద్రం చేయాలని కోరారు.  మైలవరంలో మంత్రి దేవినేని ఉమా నామినేషన్ కన్నుల పండుగగా జరిగింది. మైలవరం పురవీధులన్నీ పసుపుసంద్రంగా మారాయి. మంత్రి ఉమా నామినేషన్ కు వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు, తెదేపా శ్రేణులు హాజరయ్యారు. మహిళలు అడుగడుగునా ఆశీర్వదించారు. మంత్రి దేవినేని ఉమా విజయోత్సవ ర్యాలీగా నామినేషన్ ర్యాలీ జరగటం విశేషం. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి దేవినేని ఉమా ప్రసంగిస్తూ, పవిత్రమైన ఓటు ముద్రతో మైలవరం నియోజకవర్గ ప్రజలు మైలవరం నియోజకవర్గ అభివృద్ధి పవిత్రతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మైలవరం ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమ మాత్రమేనని, గొడవలు ఘర్షణలు కావాని తెలిపారు. పదేళ్ళ పాటు మైలవరం నియోజకవర్గంలో ఏలాంటి అశాంతి కార్యక్రమాలు జరగకుండా, అల్లర్లు జరగకుండా తాను బాధ్యత తీసుకుంటే, కొత్తగా వచ్చిన కోడికత్తి పార్టీ అల్లర్లు సృష్టించేందుకు, వ్యూహాలు గీస్తున్నట్లు ఆరోపించారు. మైలవరం నియోజకవర్గంలో 15వేల ఇళ్ళ పట్టాలిచ్చామని, 12వేలకు పైగా ఎన్టీఆర్ ఇళ్ళిచ్చామని, రూ.186కోట్లతో ఇంటింటికీ కుళాయి పథకం పనులు తీసుకొచ్చామని మంత్రి ఉమా తెలిపారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేసినట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గ రైతుల మానసపుత్రిక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రూ.4909కోట్లతో చేపట్టి, పనులను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. మైలవరం నుంచి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు దక్షతను బలపరుస్తూ ఒక సైకిల్ ఢిల్లీకి, మరో సైకిల్ అమరావతి వెళ్లాలని మంత్రి ఉమా పిలుపునిచ్చారు. తాను చనిపోయే వరకు మైలవరం నియోజకవర్గ ప్రజలకు రుణపడేవుంటానని మంత్రి ఉమా ప్రజల హర్షధ్వానాల మద్య ప్రకటించారు._

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM