వివేకా హత్య కేసులో అర్బన్ సీఐను సస్పెండ్ చేసిన డీఐజీ

by సూర్య | Fri, Mar 22, 2019, 08:43 AM

మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును ఛేదించేందుకు పోలీసులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అయితే, హత్య జరిగిన వెంటనే సంఘటన స్థలంలో ఆధారాలు కాపాడడంలో నిర్లక్ష్యపూరిత ధోరణి ప్రదర్శించారంటూ పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. వివేకా హత్య జరిగిన వెంటనే రక్తపు మరకలను కడిగేయడం వంటి చర్యలతో కీలకమైన ఆధారాలు దొరికే అవకాశాలు తగ్గిపోయాయని పోలీసు శాఖ భావిస్తోంది. అంతకుముందు, వైసీపీ నేత అవినాష్ రెడ్డి కూడా సీఐ తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM