టిడిపికి హర్షకుమార్ కి గుడ్‌బై

by సూర్య | Thu, Mar 21, 2019, 08:32 PM

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని కోస్తాలో దళిత నేతల్లో అగ్రగణ్యుడు అమలాపురం మాజీ ఎంపి హర్ష కుమార్  ఎపిసోడ్ మరోసారి నిరూపించించారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభానికి ముందు అందరిని ఆశ్చర్య పరుస్తూ కాకినాడ బహిరంగ సభకు వచ్చిన తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పసుపు కండువా కప్పుకున్నారు.  చివరి నిమిషం వరకు ఏ పార్టీ లోకి వెళ్ళి ఆయన పోటీ చేస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.   అమలాపురం ఎంపీ టిక్కెట్ ఆశించిన హర్షకుమార్ కు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించు కున్నారు. అయితే, ఆయన ఎవరికి మద్దతు ఇస్తారు, ఏ పార్టీలో చేరనున్నారనేది ఇంకా ప్రకటించలేదు.తన రాజకీయ జీవితం మొత్తం చంద్రబాబు పై పోరాటం చేసిన హర్ష కుమార్ ఈ తరహా నిర్ణయం తీసుకుంటారని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు.  


అయితే అనూహ్యంగా దివంగత మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్ కి కేటాయించి షాక్ ఇచ్చారు చంద్రబాబు. బాలయోగి కుమారుడికి తొలుత టికెట్ ఖాయమని భావించినా చివరి దశలో హర్ష కుమార్ టిడిపి తీర్ధం పుచ్చుకోవడంతో ఆ సీటును మాజీ ఎంపి కే కేటాయించారు చంద్రబాబు.  టిడిపి అమలాపురం ఎంపి గా హరీష్ పేరు గత ఏడాదిగా ప్రచారంలో వుంది. అప్పుడైనా మేల్కొని ముందుగా పసుపు పార్టీలోకి చేరివుంటే హరీష్ అంశం టిడిపి పక్కన పెట్టేసి ఉండేదన్న చర్చ నడుస్తుంది. కాగా, తాజాగా తెలుగుదేశం పార్టీకి మాజీ ఎంపీ హర్షకుమార్ ఝలక్ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం   తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM