మంగళగిరికి అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం : నారా లోకేశ్

by సూర్య | Thu, Mar 21, 2019, 03:39 PM

పసుపు-కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు 20 వేలు ఆర్థిక సాయం చేశాం.టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ కోతలు లేవు. మిగులు బడ్జెట్ లేకపోయినా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాం. కాపుల కోసం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000కోట్లు అందించాం. నిరుపేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు ముందుకెళ్తున్నారు


మంగళగిరికి అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం. రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్నారు. హోదా ఇవ్వాల్సిన మోదీ పై మాత్రం జగన్ ఒక్క విమర్శ చెయ్యరు. కేసులకు భయపడి మోదీ చెప్పినట్లు జగన్  ఆడుతున్నాడు. ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాకూడదనే లక్ష్యంతో కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడు. ఏపీకి డబ్బులతో పాటు  ప్రచార రథాలు కూడా పంపిస్తున్నారు. అనుభవం లేని జగన్ చేతిలో రాష్ట్రాన్ని పెడతామా?... ఇదేమీ పేకాట కాదు ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి. ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే ఏనాడైనా నియోజకవర్గంలో కనబడ్డారా. ప్రభుత్వంపై కేసులు వేసేందుకే ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు


నియోజకవర్గ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో కూడా ప్రజలకు తెలీదు. ఆయన రాజధాని తో సహా అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవడానికి 275 కేసులు వేసారు. సంవత్సరం లో 275 రోజులు కోర్టుల చుట్టూ తిరుగుతారు


నేను మంగళగిరిలోనే ఉంటున్నా....మా కుటుంబం ఓట్లన్నీ మంగళగిరిలోనే ఉన్నాయి. పట్టాలు ఇవ్వాలని ఇక్కడి ప్రజలు చాలా మంది కోరారు...పెండింగ్ లో ఉన్న ఈ అంశాన్ని నేను పరిశీలిస్తా. సొంత ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తాం. నాణ్యమైన ఇళ్లను మా ప్రభుత్వం నిర్మిస్తోంది భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి...అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అని లోకేష్ అన్నారు 

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM