దేశం కాదంది.... జ‌న‌సేన ర‌మ్మంది...

by సూర్య | Wed, Mar 20, 2019, 10:55 PM

గ‌త కొంత కాలంగా నంద్యాల సీటు విష‌యంలో త‌న‌కు లేదా త‌న కుమార్తెకు ఇవ్వాలంటూ ప‌ట్టుబ‌ట్టిన కర్నూల్ జిల్లా టీడీపీ కీలక నేత ఎస్పీవై రెడ్డి చివ‌రికి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. బుధ‌వారం  ఆయ‌న పవన్ కల్యాణ్ సమక్షంలో తన కుమార్తెతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి ఫ‌లితాలు వెలువ‌డి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్పుడే అభివృద్ధి కోస‌మంటూ తెలుగుదేశం పార్టీలో చేరిపోయి, వైసిపి నుంచి టిడిపిలో వ‌ల‌స‌ల‌కు మార్గం చూపారు.  2014 నుంచి 2019 వరకు ఎంపిగా బాధ్యతలు నిర్వహించిన ఆయ‌న త‌న‌కు నంద్యాల ఎంపి, త‌న కుమార్తెకు నంద్యాల అసెంబ్లీ సీటు కోరారు.  ఇందుకు టిడిపి అధిష్టానం నిరాక‌రించ‌డంతో పాటు  ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డి బరిలోకి దింపింది. త‌న‌కు సీటు ద‌క్క‌క పోవ‌టం అవ‌మానంగా భావించిన రెడ్డి తిరిగి వైసిపిలోకి వెళ్లినా బుట్టా రేణుక ప‌రిస్ధితే ఉంటుంద‌ని భావించి జ‌న‌సేన‌లో చేరారు. దీంతో తండ్రీ కూతుర్లు ఇద్ద‌రికి జ‌న‌సేన టిక్కెట్లు ఖ‌రారైన‌ట్టే క‌నిపిస్తోంది  


 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM