ఇ.వి.ఎమ్. మిషన్ పై ఓటర్ల‌కు ఆవగాహన‌

by సూర్య | Wed, Mar 20, 2019, 08:35 PM

సాధారణ ఎన్నికలు 2019 లో ఓటు వేయనున్న ఓటర్లకు ఇ.వి.ఎమ్. మరియు వి.వి.పాథ్ మిషన్లు పై అవగాహన‌ తప్పనిసరని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ పేర్కొన్నారు. ఇందు కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్టాడుతూ ఓటరు వేసే ఓటు వృదా కాకుండా వినియోగుంచుకోవాలని అన్నారు. ఓటరు వేసే ఓటు తాను ఏంపిక చేసుకున్న గుర్తుపై పడినది లేనిదీ వివిపాథ్ మిషన్లో కనిపిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోను ఒటరకు ఇ.వి.ఎమ్. మిషన్ ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన క‌ల్పించడం జరుగుతుందని తెలిపారు. వాహనాన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తూ మైక్ ద్వారా వివరాలను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఇది ఒక నూతన ప్రక్రియ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలక్టర్ కె.వి. ఎన్. చక్రధరబాబు, జాయింట్ కలెక్టర్-2 పి. రజనీకాంతరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె. నరేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM