నాయకుడిగా చూడాలని భావించా: నాగబాబు

by సూర్య | Wed, Mar 20, 2019, 01:24 PM

రాజకీయాల్లోకి రావాలని తనకు చాలా కోరికగా ఉండేదని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత వాటన్నింటిని వదిలేశానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినా తాను దూరంగానే ఉన్నాని చెప్పారు. తమ్ముడిని తమ్ముడిగా కాకుండా నాయకుడిగా చూడాలని తాను భావించానన్నారు. పవన్ కల్యాణ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న నేత అని పేర్కొన్నారు. 




పవన్ కల్యాణ్ కు తనకు వయసులో చాలా వ్యత్యాసం ఉందనీ, ఆయన్ను తాను ఎత్తుకుని ఆడించానని నాగబాబు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో క్యూట్ గా, ముద్దుముద్దుగా ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు గొప్ప నాయకుడిగా మారాడని ప్రశంసించారు.పవన్ కల్యాణ్ విషయంలో ఇన్ వాల్వ్ కాకూడదని తమ ఫ్యామిలీ ఓ అవగాహనకు వచ్చిందన్నారు. పవన్ గతంలో తన ఫోన్లను ఎత్తేవాడు కాదనీ, ఎందుకొచ్చిందిలే అని భావించేవాడని నవ్వులు పూయించారు. నరసాపురం లోక్ సభ స్థానాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నాగబాబుకు కేటాయించిన సంగతి తెలిసిందే.

Latest News

 
ఆలయంలో దొంగల బీభత్సం Fri, Mar 29, 2024, 08:22 PM
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని రైళ్లు పొడిగింపు, పూర్తి వివరాలివే Fri, Mar 29, 2024, 08:11 PM
ఎవరితో ఎవరు.. ఏపీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల పూర్తి జాబితా Fri, Mar 29, 2024, 08:08 PM
చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత Fri, Mar 29, 2024, 08:06 PM
విశాఖ తీరంలో అరుదైన చేప.. చూడటానికి అచ్చం మనిషిలాగే Fri, Mar 29, 2024, 08:05 PM