8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు జంప్‌

by సూర్య | Wed, Mar 20, 2019, 11:26 AM

ఇటానగర్‌: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈశాన్య భారత్‌లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వీరంతా మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా నాయ‌క‌త్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ)లో చేరారు. టికెట్లు కేటాయించే విషయంలో బీజేపీ కఠినంగా వ్యవహరించింది.  ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌(పీపీఏ) ఎమ్మెల్యే, మరో 19 మంది కమలం పార్టీ నేతలు కూడా ఎన్‌పీపీలో చేరారు. ప్రస్తుతం మేఘాలయలో అధికారంలో ఉన్న ఎన్‌పీపీ.. బీజేపీ మద్దతుతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 40 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీ తరఫున బరిలో దించాలని ఎన్‌పీపీ నిర్ణయించింది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM