ఏపీలో భారీగా పెరిగిన ఓటర్ల సంఖ్య

by సూర్య | Wed, Mar 20, 2019, 08:49 AM

2014 ఎన్నికలతో పోలిస్తే, మరో 20 రోజుల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నెల 25న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా, ఆ సమయానికి ఓటర్ల సంఖ్య 3.95 కోట్లను అధిగమిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. 2014 ఎన్నికల సమయానికి 3.69 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఇప్పుడా సంఖ్య 15 లక్షలకు పైగా పెరిగి 3.84 కోట్లకు చేరిందని, ఈ నెల 25న ఓటర్ల తుది జాబితా ప్రకటించే సమయానికి మరో 9.5 లక్షల ఓట్లు కలిసే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఏపీ ఓటర్ల జాబితాలో 1.55 లక్షల ఓట్లను తొలగించామని, తమకు తాజాగా 10,62,441 దరఖాస్తులు రాగా, అందులో 9.5 లక్షల వరకూ చేర్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తుది జాబితా ప్రకటించే సమయానికి 3.95 కోట్ల మంది ఓటర్లు ఉండవచ్చని అన్నారు. కొత్తగా ఓటర్లుగా చేరిన వారికి ఫోటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీని ఏప్రిల్‌ 5లోగా పూర్తి చేస్తామని అన్నారు.

Latest News

 
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM
లోకం మాధవి ఆస్తుల విలువ తెలిస్తే షాకె Sat, Apr 20, 2024, 02:08 PM