చైనాకు బౌద్ధమత గురువు దలైలామా వార్నింగ్

by సూర్య | Tue, Mar 19, 2019, 08:22 PM

‘చైనాకు చాలా బాగ తెలుసు నా వారసుడి ఎంపిక ఎంత కీలకమని.  ఈ విషయంలో నాకన్నా చైనాకే ఎక్కువ ఆసక్తి ఉంది. నా వారసుడు మాత్రం ఇండియా నుంచే వస్తాడు. రాబోయే రోజుల్లో ఇద్దరు దలైలామాలు కనిపించానా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చైనా దలైలామాను తెరపైకి తీసుకొస్తే.. అతన్ని ఎవరు నమ్మరు. దాంతో చైనాకు మరో సమస్య అవుతుంది’ అని దలైలామా చైనాకు హెచ్చరికలు జారీ చేశారు.
చైనాకు బౌద్ధమత గురువు దలైలామా గట్టి వార్నింగ్ ఇచ్చారు తన వారసుడు భారతీయుడే అవుతాడని ప్రకటించారు.. తాను మరణించిన తర్వాత.. తన వారసుడిగా ఎవరి పేరునో చైనా తెరపైకి తేవాలని చూస్తోందని ఆరోపించారు. అలా చేస్తే అతణ్ణి టిబెట్ బౌద్ధులు గౌరవించే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం ధర్మశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశం నుంచే తన వారసుడు వస్తాడని పేర్కొన్నారు. చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకుని.. 1959లో తాను ఇండియాకు వచ్చానని, అప్పటి నుంచి ప్రపంచదేశాల మద్దతుతో తన భూభాగమైన టిబెట్ కోసం పోరాడుతూనే ఉన్నానని దలైలామా తెలిపారు. 
దలైలామా వారసుడి ఎంపిక హక్కు తమదేనని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. టిబెటన్ల నమ్మకం ప్రకారం, దలైలామా మరణిస్తే, ఆయన ఆత్మ ఓ చిన్నారిలోకి ప్రవేశిస్తుంది. ఆ చిన్నారిని గుర్తించే ప్రక్రియను బౌద్ధ గురువులు పూర్తి చేసి, వారసుడిని ప్రకటిస్తారు. 1935లో జన్మించిన ప్రస్తుత దలైలామాను, ఆయన రెండేళ్ల వయసులో ఉండగానే మతగురువులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన 14వ లామాగా కొనసాగుతూ, వయసు పైబడిన కారణంగా వచ్చే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా 83 ఏళ్ల దలైలామాకు నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలిసిందే.


 


 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM