యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్లు వేస్తాం : నారా లోకేశ్

by సూర్య | Tue, Mar 19, 2019, 02:22 PM

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హైదరాబాదులో గచ్చిబౌలి కట్టారని, నేను గుంటూరు జిల్లా మంగళగిరిలో గచ్చిబౌలి కడతానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని నవులూరు వాటర్ ట్యాంక్ సెంటర్ లో టీడీపీ ప్రచార బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న నారా లోకేశ్ మాట్లాడుతూ… మన అమరావతి మన రాజధాని 5 కోట్లు ఆంధ్రుల కల అమరావతి. అలాంటి రాజధానికి  ప్రజా రాజధానికి భూములు ఇచ్చిన గ్రామస్థుల అందరికి  నా ధన్యవాదాలు.


మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలనుకుంటున్నానన్నారు. ఇదే విషయం సీఎంను అడిగితే.. చంద్రగిరి అవసరం లేదు మంగళగిరిలో పోటీ చేయమన్నారని, ప్రజల అభిమానం పెంచుకున్న తరువాతే శాసనసభలో అడుగుపెట్టమని సీఎం చెప్పారన్నారు. అందుకే గెలిపించండని నారా లోకేశ్ కోరారు. నవులూరులో 6 కోట్లతో అభివృద్ధి పనులు చేసాం. విద్యుత్ కోతలు లేకుండా చంద్రబాబు విద్యుత్ సరఫరా చేస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. నన్ను గెలిపిస్తే.. మొదటి ఏడాదిలోనే స్థానికంగా భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేస్తా. జలధార ద్వారా ఉచితంగా ఇంటింటికి కుళాయిలు మంజూరు చేస్తాను. యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్లు వేస్తాను. స్మశానలు కూడా అభివృద్ధి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. విభజన హామీలు అమలు చేసే పార్టీకే మద్దతు ఇస్తామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం. తెలుగు వారిని చులకనగా మాట్లాడిన కేసీఆర్ తో వైఎస్ జగన్ దోస్తీ పెట్టుకున్నాడని లోకేశ్ మండిపడ్డారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM