28 ఏళ్ల తరువాత సినిమా హాల్‌ పున:ప్రారంభం

by సూర్య | Tue, Mar 19, 2019, 10:25 AM

శ్రీనగర్‌ : జమ్ము కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో 28 ఏళ్ల క్రితం మూత పడిన సినిమా హాల్‌ను పునరుద్ధరించి తిరిగి ప్రారంభించారు. సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు ఈ హాల్‌లో బత్తి గుల్‌ మీటర్‌ చాలూ అనే చిత్రాన్ని చూశారు. స్థానిక వ్యాపారవేత్త ఒకరు 1989లో అనంత్‌నాగ్‌లో హెవెన్‌ పేర ఒక సినిమా హాల్‌ నిర్మించారు. అయితే 1991లో ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోవడంతో సినిమా హాల్‌ను మూసివేశారు. ఈ సినిమా హాల్‌పై గ్రెనేడ్‌ దాడి జరగడంతో హాలు దెబ్బ తిన్నది. తాజాగా సిఆర్‌పిఎఫ్‌ ఈ సినిమా హాల్‌కు 70 ఎంఎం సిల్వర్‌ స్క్రీన్‌ను, సౌండ్‌ సిస్టమ్‌ను అందజేసి హాలు పున: ప్రారంభానికి కృషి చేశాయి. ఇప్పటికీ జమ్ము కాశ్మీర్‌లో 250 మందికిపైగా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇటువంటి సమయంలో సినిమా హాల్‌ ప్రారంభించడం సాహసమేనని భావిస్తున్నారు. ఈ సినిమా హాల్‌ ప్రారంభంతో ఇక్కడి యువతలో కొత్త ఉత్సాహం కనిపించింది. దీనితో రాష్ట్రంలో అన్ని సినిమా హాళ్లను ప్రారంభించాలని సిఆర్‌పిఎఫ్‌ నిర్ణయించింది.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM