by సూర్య | Fri, Nov 01, 2024, 10:26 AM
మైలవరం రిజర్వాయర్‌లో ప్రస్తుతం 6.12 టీఎంసీల నీరు నిల్వగా, నీటి మట్టం 658.79 అడుగుల వద్ద ఉందని శుక్రవారం అధికారులు తెలిపారు. గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్‌లోకి 9,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నదని వారు వివరించారు. అంతే కాకుండా, రిజర్వాయర్ నుంచి దిగువకు కూడా 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Latest News