by సూర్య | Thu, Oct 31, 2024, 04:26 PM
శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఒక విశేషం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఏపీలో బీసీలకు పెద్ద దిక్కుగా ప్రఖ్యాతి గడించిన మాజీ మంత్రి స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్న కుటుంబానికి చెందిన మూడవ తరం వారసురాలు గౌతు శిరీష ఎమ్మెల్యే అయ్యారు. ఇక అధికారంలోకి వచ్చాక గౌతు శిరీష పలాసలో రాజకీయాన్ని వేగం పెంచేలా చేస్తున్నారు. అయితే వైసీపీని టార్గెట్ చేసుకున్న ఆమె చంద్రబాబు దృష్టిలో పడి మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Latest News