![]() |
![]() |
by సూర్య | Sun, Mar 19, 2023, 11:59 AM
మద్యం మత్తులో ముగ్గురు మహిళలు నానా రచ్చ చేసిన ఘటన చెన్నైలోని తిరువల్లికేణిలో జరిగింది. వాలాజా రోడ్డులో శనివారం రాత్రి 11 గంటలకు ముగ్గురు మహిళలు హల్‌చల్ చేశారు. పీకలదాక తాగి ఏకంగా సిటీ బస్సు కిందే పడుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని బయటకి తీశారు. అయితే వాళ్లు మళ్లీ బస్సు కింద దూరడానికి ప్రయత్నిస్తూ, పోలీసులతో గొడవ పడుతూ వీరంగం సృష్టించారు. సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Latest News