హర్షం వ్యక్తం చేసిన రమేష్ నాయుడు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:17 AM

రాజంపేట మండల పరిధిలోని పోలి గ్రామంలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించడం పట్ల బిజెపి రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతు గుంట రమేష్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మాట్లాడుతూ ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ గిరీశా పిఎస్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సర్వే నెంబర్ 1802/4, 1802/5 మరియు 1813 లో ఉన్న 7. 32 ఎకరాల భూమిని పాఠశాల సాధించడానికి కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్రీయ విద్యాలయ పాఠశాల నేటి వరకు అద్దె భవనాలలో నిర్వహిస్తూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, పోలి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో పాఠశాల పాఠశాల ఏర్పాటు చేయడం వలన విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనభ్యసించగలుగుతారని తెలిపారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM