రూ. 240 కోట్ల‌తో విశాఖ ఎయిర్‌పోర్టు విస్త‌ర‌ణ‌

by సూర్య | Sun, Mar 19, 2023, 10:49 AM

విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. ప్రయాణికుల అవసరాలకు తగినట్టుగా అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాన‌న్న‌ ఐదేళ్లలో రూ. 240 కోట్లతో విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇక్కడి నుంచి భారత విమానయాన సంస్థ (ఏఏఐ)కు ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం విమానాశ్రయంలో రెండు టెర్మినల్‌ భవనాలు ఉన్నాయి. కొత్త టెర్మినల్‌ భవనం 2009లో అందుబాటులోకి వచ్చాక, పాత టెర్మినల్‌ను సరకు రవాణా అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కొత్త టెర్మినల్‌ భవనాన్ని రెండు దశల్లో నిర్మించారు.


మొదటి దశలో రూ. 160 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ తరువాత ప్రయాణికుల సంఖ్య మరింత పెరగడంతో రెండో దశ విస్తరణ పనులు రూ. 60 కోట్లతో చేపట్టారు. ఇందులో భాగంగా టెర్మినల్‌ భవనానికి మరో పది వేల చ. మీ. విస్తీర్ణాన్ని అదనంగా జత చేశారు. ఇప్పుడు భవనం 30వేల చ. మీ. విస్తీర్ణంలో ఉంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన విస్తీర్ణాన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలకు కేటాయించారు. కొత్తగా మరో ఆరు పార్కింగ్‌ బేలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం చూసుకుంటూ 18 పార్కింగ్‌ బేలు ఉన్నాయి. ఎన్‌5 టాక్సీ ట్రాక్‌ కూడా ప్రారంభించారు. దీని ద్వారా గంటకు ఐదు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రన్‌వేని కూడా విస్తరించారు.

Latest News

 
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ Thu, Mar 23, 2023, 08:33 PM
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం Thu, Mar 23, 2023, 08:26 PM
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి Thu, Mar 23, 2023, 03:45 PM
ఏపీయూడబ్ల్యూజే వినూత్న నిరసన Thu, Mar 23, 2023, 03:16 PM
తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య Thu, Mar 23, 2023, 12:48 PM