విశాఖ మ్యాచ్‌పై అభిమానుల టెన్ష‌న్‌

by సూర్య | Sun, Mar 19, 2023, 10:48 AM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- భారత్‌ జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం విశాఖలో జరగనుంది. తన బావ కునాల్ సజ్దే వివాహం కారణంగా తొలి మ్యాచ్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ రెండో వన్డేలో కూడా మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. ఇప్ప‌టికే ఇరు జ‌ట్ల క్రీడాకారులు విశాఖ చేరుకున్నారు. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే విశాఖపట్నంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. విశాఖలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం తెల్ల‌వారు జామునుంచీ భారీ వ‌ర్షం కురుస్తోంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని, ఆ తర్వాత కూడా అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్‌. దీంతో మ్యాచ్‌కు అంతరాయం తప్పకపోవచ్చని తెలిపింది. అయితే విశాఖపట్నం స్టేడియంతో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది. కొంత సమయం పాటు వర్షం పడితే, మైదానాన్ని ఆరబెట్టడం ద్వారా ఆట ప్రారంభించవచ్చు. కానీ వర్షం అడపాదడపా కొనసాగితే మాత్రం మ్యాచ్‌ నిర్వహించడం కష్టమని తెలుస్తోంది.

Latest News

 
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM
వైసీపీ పరిపాలనంత దుర్మార్గపు పాలన Fri, Mar 29, 2024, 11:02 AM