వైకాపాకు పతనం ప్రారంభమైనది - కొమర

by సూర్య | Sun, Mar 19, 2023, 10:38 AM

టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం ఖాయం కావడంతో రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఒంటిమిట్ట మండల నాయకులు కొమర వెంకట నరసయ్య ఆధ్వర్యంలో శనివారం భారీ ఎత్తున బాణాసంచా కాల్చుతూ తప్పెట్లతో ఒంటిమిట్ట గ్రామ దేవాలయం దగ్గర టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ జగన్ రెడ్డి పతనం పులివెందుల నుంచి కడప జిల్లా నుంచి ప్రారంభమైందని వైఎస్ఆర్సిపి పార్టీని బంగాళాఖాతంలో - ప్రజలు కలిపారని అన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ రెడ్డి నిరుద్యోగులను నాలుగు సంవత్సరాల పాటు దారుణంగా మోసగించాడని ఇందుకు ప్రతిఫలంగా పట్టభద్రులు పశ్చిమ రాయలసీమ నియోజకవర్గము నుంచి భూమిరెడ్డి కి ఓట్లు వేసి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాటపల్లి శివారెడ్డి, మామిళ్ళ శ్రీహరి, బొడిచర్ల శ్రీనివాసులు, శరత్ రెడ్డి, చాంద్ భాషా, పసుపులేటి వెంకటరమణ, షేక్ రంతుల్లా, షా హుస్సేన్, కొత్తపల్లి పలుకూరి ఆంజనేయులు, పలుకూరి శ్రీరాములు, మామిడి శ్రీనివాసులు, సుమారు 100 పైబడి తెలుగుదేశం పార్టీ వీర అభిమానులు పాల్గొనడం జరిగింది.

Latest News

 
ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: డీకే శివకుమార్ Wed, Mar 29, 2023, 09:04 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Wed, Mar 29, 2023, 08:51 PM
వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:48 PM
రాష్ట్రం నీ అబ్బ సొత్తా... జగన్ పై మండిపడ్డిన వైసీపీ రెబల్ ఎంపీ Wed, Mar 29, 2023, 08:40 PM
ఎన్టీఆర్ ప్లస్ వైఎస్సార్ ఈక్వల్ టు సీఎం వైఎస్ జగన్: కొడాలి నాని Wed, Mar 29, 2023, 08:38 PM