చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయం: బుద్దా వెంకన్న

by సూర్య | Sat, Mar 18, 2023, 08:06 PM

మళ్లీ‌ చంద్రబాబు సీఎం కావడం ఖాయం..‌ అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం నిదర్శనమని టీడీపీ నేత  బుద్దా వెంకన్న స్పష్టంచేశారు. ఏపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల సంబరాలు చేసుకున్నారు. విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్న నివాసం టిడిపి శ్రేణులు చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూల వర్షం, బాణా సంచా పేల్చి సందడి చేశారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో మంచి తీర్పు ఇచ్చిన వారందరికీ పాదాభివందనం అన్నారు వెంకన్న. మళ్లీ‌ చంద్రబాబు సీఎం కావడం ఖాయం..‌ అందుకు ఈ‌ఫలితం నిదర్శనమన్నారు. కోట్లు ఖర్చు పెట్టిన వైఎస్సార్‌సీపీని ప్రజలు తిరస్కరించారన్నారు.


అడ్డదారుల్లో విజయం సాధించాలన్న వైఎస్సార్‌సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. 151 సీట్లు ఇస్తే రాక్షస పాలన సాగిస్తున్న జగన్ ఇంటికి‌ వెళ్లడం ఖాయమని.. దేవుడు రాసిన స్క్రిప్ట్ కాబట్టే 14నెలలు ముందుగానే నీ ఓటమి కి బాటలు వేశారన్నారు. కుప్పంలో ‌చెత్త కుప్పను‌ కూడా కొట్టలేరని.. పులివెందులలోనే ప్రజలు పాలనను‌ వ్యతిరేకించారన్నారు. ఈ సెమీ ఫైనల్ లో ఓడిపోయిన జగన్.. ఇప్పుడు అయినా బుద్ది తెచ్చుకోవాలన్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ బిక్షతో పెరిగిన కొడాలి నాని, వంశీ, అవినాష్ లు మూట ముల్లె సర్దుకుంటున్నారన్నారని.. విదేశాలకు వెళ్లేందుకు అన్నీ సిద్దం చేసుకుంటున్నారన్నారు.


వ్యక్తిగత దూషణలు‌ చేసి‌న వాళ్లు ఈ‌ ఫలితాల‌తో అయినా బుద్ది తెచ్చుకోవాలన్నారు వెంకన్న. జూన్ నుంచి విశాఖ నుంచి పాలన అన్న జగన్ ను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని.. ఉత్తరాంధ్ర ప్రజలు వైఎస్సార్‌సీపీ నాయకులను అసహ్యించుకుంటున్నారన్నారు. అక్కడ వేల‌కోట్ల భూములను‌ దోచేశారని.. గ్లోబల్ సమ్మిట్ కాదు.. జె సమ్మిట్ అది అంటూ సెటైర్లు పేల్చారు. బినామీల ద్వారా మళ్లీ‌ భూముల దోపిడీకీ సిద్దం అయ్యారని.. ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాతో సిఎం స్వయంగా దోచుకుంటే ఇక ఎవరికి చెప్పాలన్నారు. ఇప్పుడు అయినా జగన్ ఓటమిని అంగీకరించి రాజీనామా చేయాలన్నారు.


Latest News

 
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM
కాలజ్ఞాన సన్నిధిలో సినీ నటుడు సుమన్ Wed, Apr 24, 2024, 11:09 AM
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM