తారకరత్నను పరామర్శించిన నారా లోకేష్...ఆరోగ్య పరిస్థితిపై ఆరా

by సూర్య | Fri, Jan 27, 2023, 11:46 PM

హీరో నందమూరి తారకరత్నను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో శుక్రవారం పాదయాత్ర ముగించిన తర్వాత.. లోకేష్ హాస్పిటల్‌కు వెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూశారు. అనంతరం తన మావయ్య బాలకృష్ణతో కలిసి.. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు.


తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నందమూరి బాలకృష్ణ చెప్పారు. తారకరత్న బీపీ 120/80 చూపిస్తుందని.. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయిందని వెల్లడించారు. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. మిగతా పారామీటర్స్‌ అన్నీ బాగానే ఉన్నాయని.. ప్రాథమిక చికిత్స అందించారని వివరించారు. తారకరత్న ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారని వెల్లడించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని బాలకృష్ణ చెప్పారు.


Latest News

 
కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని Tue, Apr 16, 2024, 01:07 PM
సీఎం జగన్ పై పవన్, బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ పిర్యాదు Tue, Apr 16, 2024, 01:02 PM
ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు Tue, Apr 16, 2024, 01:00 PM
ఇంటింటి ప్రచారంలో ఆదిమూలపు సతీష్ Tue, Apr 16, 2024, 01:00 PM
సింపతీ పొందాల్సిన పరిస్థితి వైసీపీకి ఉందా ? Tue, Apr 16, 2024, 12:56 PM