విశ్వాసం, సమర్థత, నిజాయితీలో ఏపీ పోలీస్ టాప్

by సూర్య | Fri, Jan 27, 2023, 11:45 PM

దేశంలోని పోలీస్ వ్యవస్థలో ఏపీకి అరుదైన స్థానం దక్కింది. పోలీసులపై ప్రజల విశ్వాసం, సమర్థత, నిజాయితీకి సంబంధించి.. అన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో.. మొదటి ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రధమ స్థానంలో నిలిచిందని.. ఏపీ పోలీస్ శాఖ వెల్లడించింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు గర్వకారణం అని అభిప్రాయపడింది. గత ఏడాది పోలీసు శాఖ తీసుకున్న ప్రత్యేక చర్యల ద్వారా.. ఈ ఫలితాలు లభించాయని స్పష్టం చేసింది.


1.7 కోట్లు దిశ మొబైల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్లు.. సాంకేతికతో కూడిన కచ్చితమైన సాక్ష్యాధారాలు, నేర నిరూపణతో శిక్ష పడే విధంగా దర్యాప్తు.. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్.. సాంకేతికత వినియోగం ద్వారా త్వరితగతిన పోలీసు ప్రతి స్పందన.. పోలీసుల్లో క్రమశిక్షణా విధానాన్ని పెంపొందించడం ద్వారా ఏపీకి ప్రశంసలు దక్కాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో.. జిల్లా ఎస్పీల నుంచి కానిస్టేబుళ్ల వరకు.. చేసిన కృషి ద్వారా ఈ ఫలితాలు లభించాయని చెప్పారు. ఈ ఫలితాలను సాధించడంలో సహకరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.


పోలీసులపై ప్రజల విశ్వాసం విభాగంలో..


1.ఆంధ్రప్రదేశ్


2.తమిళనాడు


3.తెలంగాణ


4.గుజరాత్


5.ఢిల్లీ


సమర్థత విభాగంలో..


1.ఆంధ్రప్రదేశ్


2.తెలంగాణ


3.గుజరాత్


4.హిమాచల్ ప్రదేశ్


5.జార్ఖండ్


నిజాయతీ విభాగంలో..


1.ఆంధ్రప్రదేశ్


2.ఉత్తరాఖండ్


3.తెలంగాణ


4.గుజరాత్


5.ఢిల్లీ


Latest News

 
కొనకనమిట్ల మండలంలో ఎమ్మెల్యే అన్నా ఎన్నికల ప్రచారం Fri, Mar 29, 2024, 01:09 PM
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు Fri, Mar 29, 2024, 01:06 PM
రైతు పై ఎలుగుబంటి దాడి Fri, Mar 29, 2024, 01:04 PM
కంబదూరులో పిల్లవాడి కిడ్నాప్ యత్నం విఫలం Fri, Mar 29, 2024, 01:00 PM
టిప్పర్ ఢీకొని యువకుడు మృతి Fri, Mar 29, 2024, 12:57 PM