జియో సహకారంతో నూతన ఈ యాప్...ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్

by సూర్య | Fri, Jan 27, 2023, 09:16 PM

భక్తుల సౌకర్యార్థం టీటీడీ తాజాగా మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ను టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. జియో సహకారంతో నూతన ఈ యాప్‌ను రూపొందించారు. శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్‌ చేసుకోవచ్చు.. అలాగే తిరుమలకు సంబంధించి సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంటుంది. తిరుమల శ్రీవారికి విరాళాలు కూడా అందజేయొచ్చు. గతంలో టీటీడీకి గోవింద యాప్‌ ఉండగా.. కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అందుకే ఈ స్థానంలో కొత్త యాప్‌ తీసుకొచ్చారు.. జియోతో ఒప్పందం చేసుకున్నారు.


శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకునే సమయంలో టీటీడీ సర్వర్లలో సమస్యలు ఎదురయ్యాయి. గతంలో ప్రయోగాత్మకంగా జియో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా ఆన్‌లైన్ టికెట్లు జారీ చేశారు.. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండానే గంటలోపే భక్తులు టికెట్లు బుక్ చేసుకున్న సంగతి తెలిసిందే. టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట ఉండేలా ఈ యాప్ రూపొందించారు.


మొన్నటి వరకు దర్శన టికెట్లను కేవలం ఆన్‌లైన్‌ వెబ్‌పైట్ ద్వారా బుక్ చేసుకునేవారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన యాప్‌ ద్వారా భక్తులు సులభంగా దర్శనం, గదులు, శ్రీవారిసేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చు అంటోంది టీటీడీ. అలాగే సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా యాప్ తయారు చేశారు. మొత్తానికి టీటీడీ భక్తులకు ఇబ్బందులు లేకుండా యాప్ తీసుకొచ్చింది.

Latest News

 
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM
వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు,,,షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ Thu, Apr 25, 2024, 07:25 PM
తిరుమల శ్రీవారి సేవకులుగా అద్భుత అవకాశం.. భక్తులు వెంటనే బుక్ చేస్కోండి Thu, Apr 25, 2024, 07:21 PM
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం, నిందలు.. సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ Thu, Apr 25, 2024, 07:15 PM
వైసీపీ ఎమ్మెల్యే నామినేషన్‌ ర్యాలీలో అపశృతి.. మంటల్లో కాలిపోయిన టీడీపీ కార్యకర్త ఇల్లు Thu, Apr 25, 2024, 07:10 PM