సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంభానికి భరోసానిచ్చిన సీఎం జగన్

by సూర్య | Wed, Jan 25, 2023, 11:46 PM

మీకు అండగా ఉంటా అని సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంభానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి భరోసా నిచ్నిచారు.  ఇదిలావుంటే సీఎం జగన్ ను సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. క్లిష్ట ప‌రిస్థితుల్లో త‌మ కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. దివంగత నేత‌ వైఎస్ రాజశేఖర రెడ్డితో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ఉన్న‌ అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి జగన్‌  తో పంచుకున్నారు.


సిరివెన్నెల అనారోగ్యంగా ఉన్న సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం.. ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేయడంపై సీఎం జగన్‌కు సిరివెన్నెల కుటుంబ స‌భ్యులు కృతజ్ఞతలు చెప్పారు. అయితే.. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని.. సీఎం జ‌గ‌న్‌ భరోసా ఇచ్చారు. సీఎంని కలిసిన వారిలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె లలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్‌.శాస్త్రి ఉన్నారు.


Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM