సీఎం జగన్ ను కలిసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబం

by సూర్య | Wed, Jan 25, 2023, 11:07 PM

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి  కుటుంబం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిరివెన్నెల భార్య పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీ లలితాదేవి, సిరివెన్నెల సోదరుడు సి.ఎస్. శాస్త్రి  సీఎంతో కలిసి కాసేపు ముచ్చటించారు. సిరివెన్నెలకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జగన్ సాయం చేశారు. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని జగన్ ప్రభుత్వమే భరించింది. తమ కుటుంబాన్ని ఆదుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

 
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా Mon, Feb 06, 2023, 10:57 PM