హిందూపురంకు బాలకృష్ణ.... ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానికి హాజరు

by సూర్య | Wed, Jan 25, 2023, 09:01 PM

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. హిందూపురంలో రేపు టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దీనికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఎటూ తేల్చిచెప్పకపోవడంతో కార్యక్రమ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. 


కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇచ్చేందుకు తటపటాయిస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ముందస్తుగా అనుమతి కోరినా ఇంకా స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ వెంకటేశ్వరరావు ఇదే విషయమై మాట్లాడుతూ.. రహదారిపై సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిరసన కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని తెలిపారు.


Latest News

 
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు ,,,నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్ రెడ్డి Thu, Feb 02, 2023, 06:54 PM
పౌరసర ఫరాల శాఖ గోధుమ పిండి..ప్రారంభించిన మంత్రి Thu, Feb 02, 2023, 06:53 PM
చంద్రబాబు దళిత వ్యతిరేకి... మేకపాటి సుచరిత Thu, Feb 02, 2023, 06:53 PM
విద్యాకానుక వస్తువులను పరిశీలించిన జగన్ Thu, Feb 02, 2023, 06:52 PM
పోలవరం విషయంలో మళ్లీ నిరాశే మిగిలింది,,అరకొరగా ఏపీని ఆదుకొన్నారు Thu, Feb 02, 2023, 06:51 PM