అమెరికా రోడ్డు ప్రమాదంలో...మరణించిన తెలుగు యువతి

by సూర్య | Wed, Jan 25, 2023, 08:58 PM

విదేశాల్లో చదవు, ఉపాధి కోసం వెళ్లి మనవాళ్లు పలు ప్రమాదాలలో ప్రాణాలను పోగోట్టుకొంటున్నారు. తాజాగా అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. వేగంగా వచ్చిన పోలీస్ కార్ ఢీ కొట్టడంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. యాక్సిడెంట్ విషయం తెలిసి అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, యువతిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స్ పొందుతూ తుదిశ్వాస వదిలింది. ఈ ప్రమాదంలో చనిపోయిన యువతిని ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవిగా గుర్తించారు. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు.


సియాటిల్ లో ఉంటున్న కందుల జాహ్నవి.. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో థామస్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన పోలీస్ వాహనం ఆమెను ఢీ కొట్టింది. దీంతో జాహ్నవికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగా.. జాహ్నవి మరణించింది. కాగా, ఈ ప్రమాదానికి కారణమైన అధికారి 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నాడని సియాటిల్ పోలీసులు చెప్పారు. అయితే, అతని వివరాలను మాత్రం వారు బయటపెట్టలేదు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


Latest News

 
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ సర్కార్ Sun, Oct 01, 2023, 10:27 PM
అక్టోబర్ 28న శ్రీవారి ఆలయం మూసివేత Sun, Oct 01, 2023, 10:20 PM
రాజకీయాల్లో కొన్నిసార్లు 1 1=0 అవుతుంది...అంబటి రాంబాబు Sun, Oct 01, 2023, 09:59 PM
అవును ఇది కురుక్షేత్ర యుద్ధమే..మేం పాండవులం, మీరు కౌరవులు Sun, Oct 01, 2023, 09:53 PM
భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్....ఉద్రిక్తత వాతావరణం Sun, Oct 01, 2023, 08:41 PM