పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చుపెట్టారు : పవన్ కళ్యణ్

by సూర్య | Wed, Jan 25, 2023, 08:41 PM

ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతాడని, వివక్షకు గురైనప్పుడే ఆ విషయం తెలుస్తుందన్నారు. తనపై కూడా వివక్ష చూపారని అన్నారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణిస్తుండగా ఓ బ్రిటీష్ మహిళ తనకు నీళ్లు ఇవ్వడానికి నిరాకరించిందని చెప్పాడు. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తొలగించామని చెప్పడం బాధాకరమన్నారు.ఈ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన రూ. 20 వేల కోట్లను రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చుపెట్టారు...వైసీపీ రంగులు రూ. 21,500 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. నిధులు పక్కదారి పట్టించి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని దుయ్య బట్టారు.


 

Latest News

 
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా Mon, Feb 06, 2023, 10:57 PM