శాంతి భద్రతలు పరిరక్షించాలి: డిజిపి

by సూర్య | Wed, Jan 25, 2023, 07:50 PM

పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి శాంతి భద్రతలు పరిరక్షించాలని రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ అన్నారు. బుధవారం జిల్లాల ఎస్పీలతో, పోలీస్ కమిషనర్లతో పెండింగ్ ఉన్న కేసులు, ఫంక్షనల్ వర్టికల్, సైబర్ క్రైమ్ ల గురించి డిజిపి ఆఫీస్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ పెండింగులో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులు, సిబ్బంది భాద్యతగా పనిచేయాలన్నారు. మహిళలు, పిల్లలపై నేరాల నివారణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, మహిళలు, పిల్లలపై నేరాల నివారణపై సమర్థవంతంగా పనిచేసే అధికారులను గుర్తించి రివార్డులు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.

ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ప్రతి కేసుకు సంబంధించి ప్లాన్ అఫ్ యాక్షన్ ఉండాలని దీనిని సంబంధించి డీఎస్పీలు, యూనిట్ ఆఫీసర్లు మానిటర్ చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల, సిబ్బంది సర్వీస్ వివరాలు ఆన్లైన్ ప్రక్రియ గురించి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం ను పకడ్బందిగా అమలు చేయలని సూచించారు.

తెలంగాణ రాష్ట పోలీసు శాఖ ఏకీకృత సేవలకోసం ప్రవేశపెట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ ను పటిష్టంగా అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఎస్. హెచ్. ఓ. లు, రిసెప్షన్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, క్రైం సిబ్బంది, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, వారెంట్, సమన్స్ సిబ్బంది, టెక్ టీమ్, 5 ఎస్, మెడికల్ సర్టిఫికెట్స్, ఎఫ్. ఎస్. ఎల్. , సెక్షన్ ఇంచార్జ్, ఐఓలు, జనరల్ డ్యూటీ సిబ్బందికి సంబందించిన వర్టీకల్స్ పై డీజీపీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీలు ప్రకాష్, రవీంద్ర రెడ్డి, రవీంద్ర కుమార్, ఏవో అమర్నాథ్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, మల్లయ్య, సి. ఐ లు, కృష్ణ కుమార్, కిషోర్, కొటేశ్వర్, లక్ష్మినారాయణ, రమణమూర్తి, ఆర్ఐలు వామనమూర్తి, నవీన్ సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM