తీవ్ర అస్వస్థతకు గురైన వైసీపీ ఎమ్మెల్యే

by సూర్య | Wed, Jan 25, 2023, 04:14 PM

ఏలూరు జిల్లా, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీరసంగా ఉన్న బాలరాజు జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు బాలరాజుకు మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి రిఫర్‌ చేశారు. కుటుంబ సభ్యులు ఆయన్ను రాజమండ్రిలోని సాయి ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండెకు స్టంట్‌ అమర్చారు.  ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎమ్మెల్యే బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును లోక్‌సభలో వైయ‌స్ఆర్‌సీపీ చీఫ్‌ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ తదితరులు పరామర్శించారు. 

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM