మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ.49 వేల కోట్లు ఖర్చు చేశాం

by సూర్య | Wed, Jan 25, 2023, 04:13 PM

రాష్ట్ర ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని అక్కసు, సంక్షేమ పాలనలను చూసి ఓర్వలేనితనంతో కొన్ని పత్రికలూ  తప్పుడు రాతలు రాస్తున్నాడని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మూడున్నరేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని చెప్పారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాతే ఎస్సీ, ఎస్టీలకు అధిక లబ్ధి చేకూరిందన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో కంటే 45 శాతం అధికంగా ఎస్సీలకు ఖర్చు చేశామని చెప్పారు. సమాజంలోని అసమానతలు తొలగించేలా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ.49 వేల కోట్లను వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. దళిత, గిరిజన పిల్లలకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందిస్తున్నామన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే సబ్‌ప్లాన్‌పై పవన్‌ మీటింగ్‌ పెడుతున్నాడన్నారు. పవన్‌కు నిజాలు, లెక్కలు తెలియకపోతే తాను చెప్తానని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. 

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM