లోకేష్ కి మేము అండగా ఉన్నాం అంటున్న బీసీ దళం

by సూర్య | Wed, Jan 25, 2023, 03:28 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు తోడుగా బీసీ దళం ఉంటుందని రాష్ట్ర బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి తెలిపారు. మంగళవారం విజయవాడ  ఆటోనగర్‌లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....  లోకేష్‌ 400 రోజుల పాటు 4వేల కి లోమీటర్లు చేస్తున్న పాదయాత్రకు విజయవంతం కా వాలని కోరుతూ బుధవారం మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి దుర్గగుడి వర కు పాదయాత్రగా వెళ్లి దుర్గమ్మకు 400 టెంకాయలు కొట్టి, చీర సారె సమర్పిస్తామన్నారు. పాదయాత్రలో రాష్ట్ర నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పాల్గొంటారన్నారు. కావున పార్టీ నేతలు, అన్ని బీసీ విభాగాలకు సంబంధించిన నేతలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర బీసీ గౌడ సాధికారిక కార్యదర్శి బొల్లా వెంకటేశ్వరరావు గౌడ్‌, జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శి ఆర్‌. యల్లబాబు, ఉమ్మడి జిల్లాల బీసీ గౌడ సాధికారిక క న్వీనర్‌ పి.కిషోర్‌ బాబు, శివరాం గౌడ్‌ పాల్గొన్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM