అంగన్వాడీ వ్యవస్థ 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలి

by సూర్య | Wed, Jan 25, 2023, 03:28 PM

బాల్య వివాహాలను అరికట్టడంలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని కడప కలెక్టర్‌ విజయరామరాజు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో బేటీ బచావో-బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు జిల్లా మహిళా, శిశు సాధికారిత వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...  అంగన్వాడీ వ్యవస్థ 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని... అప్పుడే వారి శారీరక, మానసిక అభివృద్ధి దోహదపడి వారు విద్యనభ్యసించుటలో పురోగతి సాధిస్తార న్నారు. బాల్యవివాహాలు అరికట్టడంలో అంగన్వాడీ వ్యవస్థ కీలకమన్నారు. పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా ఒక్కటేనని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు లక్ష్మీదేవి మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్‌ అధికారిణి ఎంఎన్‌రాణి, ఎస్‌ఎ్‌సఏ ప్రోగ్రాం అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM