నేడు కడపకు వెళ్లనున్న నారా లోకేష్

by సూర్య | Wed, Jan 25, 2023, 03:27 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్‌ బుధవారం కడపకు రానున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు లోకేశ్‌ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యువగళం పేరుతో ఈ నెల 27 నుంచి నారా లోకేశ్‌ కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా లోకేశ్‌ హైదరాబాదు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టు నుంచి 3.30కు బయల్దేరి 4.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 4.45కు రోడ్డుమార్గాన బయల్దేరి 5.10కి దేవుని కడపలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటారు. 5.30 గంటల వరకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 5.30కు బయల్దేరి 5.45 గంటలకు అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకుంటారు. 6గంటల వరకు అక్కడే ప్రత్యేక ప్రార్థనలు చే స్తారు. అనంతరం 6 గంటలకు బయల్దేరి 6.15కు మరియాపురంలోని రోమన్‌ కేథలిక్‌ కేథడ్రిల్‌ చర్చికి చేరుకుంటారు. 6.45 వరకు అక్కడే ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం సాయంత్రం బయల్దేరి తిరుమలకు వెళతారు.

Latest News

 
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా Mon, Feb 06, 2023, 10:57 PM