జాతీయ ఉపకార వేతన పథకం రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

by సూర్య | Wed, Jan 25, 2023, 03:12 PM

మైనారిటీ వర్గాల్లోని పేద విద్యార్థులకు అందించే జాతీయ ఉపకార వేతన పథకం (ప్రీ మెట్రిక్‌)ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఫలితంగా కొందరు విద్యార్థులు ఆందోళన చెందు తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1-8వ తరగతులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.1000, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1-5 తరగతుల విద్యార్థులకు రూ.1000, 6-10వ తరగతి వరకు రూ.5 వేలు అందించేవారు. ప్రస్తుతం 1-8వ తరగతుల విద్యార్థులకు పథకాన్ని రద్దు చేశారు. 9, 10వ తరగతి విద్యార్థులకే కొనసాగనుంది. విద్యా సంవత్సరం సగం పూర్తయిన తరు ణంలో ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉపకార వేతనానికి దూరమయ్యారు.

Latest News

 
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM