పారిశుధ్య కార్మికులకు అంత పరిజ్ఞానం ఉందా...?

by సూర్య | Wed, Jan 25, 2023, 03:11 PM

పారిశుధ్య కార్మికులు ముఖ హాజరు(ఏపీఎ్‌ఫఆర్‌ఎస్‌) కోసం స్మార్టు ఫోన్లు కొని, వాటిని ఉపయోగించలేరని, ఈ హాజరు నుంచి పారిశుధ్య కార్మికులను మినహాయించాలని ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆసుల రంగనాయకులు కోరారు. నిరక్షరాస్యులైన పారిశుధ్య కార్మికులకు స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ ఇచ్చేంత పరిజ్ఞానం తెలియదన్నారు. మునిసిపల్‌ కార్మికులకు యధావిధిగా మస్తరు విధానాన్నే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. క్లాప్‌ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18,500 చెల్లించాలని కోరారు. ఈ సమస్యలపై జనవరి 26న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇస్తామన్నారు. 28న మునిసిపల్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు, 30న కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, ఫిబ్రవరి 8న ఆర్డీఓ కార్యాలయాల ముట్టడి, ఫిబ్రవరి 15న టూల్‌డౌన్‌ సమ్మె, ఫిబ్రవరి 5న క్లాప్‌ డ్రైవర్లు, ఇంజనీరింగ్‌ కార్మికులతో సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మునిసిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు.

Latest News

 
రెండో రోజు నాలుగు నామినేషన్లు Sat, Apr 20, 2024, 10:49 AM
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత Sat, Apr 20, 2024, 10:41 AM
పెద్దతిప్పిసముద్రంలో రేపే ప్రవేశ పరీక్ష Sat, Apr 20, 2024, 10:40 AM
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM