జగన్ ని అంబేడ్కర్‌ తో పోల్చడం సిగ్గుచేటు

by సూర్య | Wed, Jan 25, 2023, 03:10 PM

సామాజికంగా, ఆర్ధిక, రాజకీయంగా ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు సీఎం జగన్‌ చేసిన మేలు ఏవరు చేయలేదని, ఆయన్ను అంబేడ్కర్‌లో పోల్చుతూ వైసీపీ నేతలు ముఖ్యంగా సామాజిక సలహాదారు హోదాలోని వ్యక్తి ఇటీవల వ్యాఖ్యనించడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం కింద వైసీపీ ప్రభుత్వం 49 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. వీటిపై తనతో చర్చించేందుకు వైసీపీ నాయకులకు దమ్ముందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు ఈ నాలుగేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం కేవలం రూ.25 కోట్లు కేటాయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్దికి ఖర్చు చేయాల్సిన సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి సుమారు 12,715 వేల కోట్లను అమ్మఒడికి కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం పేరును జగనన్న విదేశీ విద్య దీవెన పథకంగా మార్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘గడపగడపకు దగా ప్రభుత్వం’’ కార్యక్రమం ద్వారా 175 నియోజకవర్గాల్లో పర్యటించి ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరిస్తామని తెలిపారు. 

Latest News

 
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM