ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

by సూర్య | Wed, Jan 25, 2023, 02:35 PM

13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని బుధవారం నాగులుప్పలపాడులో తహసిల్దార్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓటర్ల దినోత్సవ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసిల్దార్ అశోక్ రెడ్డి సూచించారు. అనంతరం ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ శ్రీనివాసరావు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM