రహదారి నిబంధనలు తప్పనిసరి

by సూర్య | Wed, Jan 25, 2023, 02:31 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని శ్రీకాకుళం జిల్లా,  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ కోరారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారి ఎక్కువ భాగం ఉందని, వాహన చోదకులు తప్పని సరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడం, హెల్మెట్‌ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టు పెట్టుకోవపోవడం, రహదారి నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో ఎక్కువ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వాహనచోదకులు విధిగి కంటి పరీక్షలు చేయించు కోవాలన్నారు. ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

Latest News

 
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM