కార్మిక ప్రజా గర్జనకు వైసీపీ నేతలకి పిలుపు

by సూర్య | Wed, Jan 25, 2023, 02:29 PM

 స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 30న చేపట్టనున్న కార్మిక ప్రజా గర్జనలో పాల్గొనవలసిందిగా కోరుతూ శ్రీకాకుళంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు, మిందిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆహ్వాన పత్రికలను అందజేశారు. కార్మిక ప్రజా గర్జనకు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వారిని కలిసిన వారిలో పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, నాయకులు కేఎస్‌ఎన్‌ రావు, జె.అయోధ్యరామ్‌, నీరుకొండ రామచంద్రరావు, బి.అప్పారావు, సుబ్బయ్య, తదితరులు ఉన్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM