విధినిర్వహణలో అక్రమాలకు పాల్పడిన వారి సస్పెండ్‌

by సూర్య | Wed, Jan 25, 2023, 02:26 PM

వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కె.సంధ్య, మెహర్‌ కుమార్‌, గడ్డం ప్రసాద్‌, జీఆర్‌వీ ప్రసాద్‌లను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు విడుదల చేసింది. వీరంతా గుంటూరు, విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ నలుగురు విధినిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్టు మీడియాలో కథనాలు వచ్చాయని, విచారణ జరిపి, ఆ నివేదిక ఆధారంగా సస్పెండ్‌ చేస్తున్నట్టు రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై తుది విచారణ నివేదికను గత డిసెంబరు 19వ తేదీన ప్రభుత్వానికి సమర్పించినట్టు ఆ ఆదేశాల్లో తెలిపారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM