చిన్ననాటి ఇంటిని బాగు చేపిస్తున్న నటుడు

by సూర్య | Wed, Jan 25, 2023, 02:24 PM

సినీ నటుడు, ప్రముఖ నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్‌ స్వగ్రామం ఏలూరు రూరల్‌ మండలంలోని చాటపర్రు. ఈ గ్రామంలో ఆయన పూర్వీకులు 1925 సంవత్సరంలో రెండంతస్తులతో భవనం నిర్మించారు. ఈ ఇంట్లోనే మురళీమోహన్‌ జన్మించారు. ఇక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేసి, పై చదువులకు ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలకు వెళ్లారు. చాటపర్రు నుంచే సినీ వ్యాపార రంగాల్లో అడుగు పెట్టారు. తాతల నాటి ఇంటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇచ్చి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. పూర్వీకులు నిర్మించిన భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఇటీవల చాటపర్రు వచ్చిన మురళీమోహన్‌.. తాతల నాటి ఇంటి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో పునర్నిర్మాణం చేపట్టారు. పాత భవనం రూపురేఖలను మార్చకుండా.. మరో 50 ఏళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా.. కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. గ్రామానికి సంబంధించి సామాజిక అవసరాల కోసం ఈ భవనాన్ని ఇవ్వనున్నట్లు మురళీమోహన్‌ చెప్పారు.

Latest News

 
నెల్లూరు జిల్లాలో టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు Tue, Apr 16, 2024, 04:07 PM
అడుగడుగునా జగన్ యాత్రకి సంఘీభావం తెలుపుతున్న ప్రజలు Tue, Apr 16, 2024, 04:07 PM
ప్రభుత్వ ఖజానాను దోచుకున్న బందిపోటువి నువ్వు కాదా? చంద్రబాబు Tue, Apr 16, 2024, 04:06 PM
ఏ మొఖం పెట్టుకుని బీసీ, ఎస్సీ కాలనీలకు వెళ్తావు..? Tue, Apr 16, 2024, 04:05 PM
అంధుల డిజిటల్‌ లైబ్రరీని ప్రారంభించిన కలెక్టర్‌ Tue, Apr 16, 2024, 04:00 PM