జగన్ వస్తుంటే చెట్లు కూడా ఉండకూడదా...?

by సూర్య | Wed, Jan 25, 2023, 02:22 PM

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే చాలు.. ఆ ప్రాంతంలో పరదాలు కట్టడం, జనం రోడ్లపైకి రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, దుకాణాలు మూసివేయించడం.. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ మళ్లించి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడం.. సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. అయితే.. విశాఖపట్నంలో అధికారులు మరో అడుగు ముందుకేసి రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న పచ్చని చెట్లను కూడా నరికించి వేస్తున్నారు. చినముషిడివాడలోని శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెల 28న సీఎం విశాఖ నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో చినముషిడివాడ ఆర్చి నుంచి శారదా పీఠం వరకు రోడ్డు మధ్యలో డివైడర్‌పై ఉన్న చెట్లను రెండురోజులుగా నరికిస్తున్నారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన పచ్చని చెట్లతో వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పీఠానికి సమీపంలో రెండు రోడ్లను కలుపుతూ మధ్యలో భారీ వేదికను నిర్మించనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో పీఠం సమీపంలోని చెట్లను మాత్రమే నరికివేస్తే మరోలా ప్రచారం చేస్తారని భావించి.. చినముషిడివాడ ఆర్చి నుంచి ఉన్న చెట్లన్నీ తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Latest News

 
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM