దుర్గమ్మ చెంతకి చేరిన వారాహి వాహనం

by సూర్య | Wed, Jan 25, 2023, 02:18 PM

నిన్న కొండగట్టు ధర్మపురిలో వారాహి  వాహనానికి పూజలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. బుధవారం విజయవాడ దుర్గమ్మ  చెంత పూజలు జరిపించారు. అనంతరం పవన్ ఇంద్రకీలాద్రి కి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కొండపైకి వారాహి వాహనానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. దీంతో ఘాట్ రోడ్ టోల్ గేట్ దగ్గర అమ్మవారి విగ్రహం ఎదుట వాహనానికి పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ముందుజాగ్రత్తగా ఇంద్రకీలాద్రి దగ్గర పోలీసులు మోహరించారు. అమ్మవారి దర్శనం కోసం పవన్ లోపలికి వెళ్లగా ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని లోపలికి అనుమతించలేదు. ముఖ్య నేతలను మాత్రమే అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ అధినేత పవన్ కల్యాణ్‌కు మంచి జరగాలని, భవిష్యత్‌లో జనసేన విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నారు. కాగా పవన్ రాక సందర్భంగా ఘాట్ రోడ్లు మూసివేశారు.

Latest News

 
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM