కాంగ్రెస్ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోదో అభియాన్ కార్యక్రమం

by సూర్య | Wed, Jan 25, 2023, 02:18 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోదో యాత్ర 3600 కి మీ కావస్తున్న సందర్భంగా హిందూపురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోదో అభియాన్ చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు శ్యామ్ కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం హిందూపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 తేది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి హాత్ సే హాత్ జోదో కార్యక్రమాన్ని 2 నెలల పాటు హిందూపురం నియోజకవర్గంలో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ హరిత, జనరల్ సెక్రటరీ కలీం, వైస్ ప్రెసిడెంట్ షాహిద్, ఎన్ఎస్ యుఐ నేషనల్ సెక్రటరీ సంపత్, హిందూపురం మండల ప్రెసిడెంట్ హనుమంతారాయప్ప, కిసాన్ సెల్ ప్రెసిడెంట్ తిమ్మా రెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అంజి, బి బ్లాక్ ప్రెసిడెంట్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM