చేనేత పరిశ్రమ పూర్వ వైభవానికి సీఎం జగన్ కృషి: ఎమ్మెల్యే ఆర్కే

by సూర్య | Wed, Jan 25, 2023, 01:44 PM

అంతరించిపోతున్న చేనేత పరిశ్రమకు పూర్వం వైభవం తీసుకువచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహకల్ప ఆవరణలో రూ. 2. 40కోట్ల నిధులతో చేపట్టిన 120మగ్గాల షెడ్ల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కలిసి ఎమ్మెల్యే ఆర్కే శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ప్రధాని మోదీ సౌజన్యంతో నేషనల్ కాంప్రజెన్సివ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కింద రూ. 1.10 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.30 కోట్లు కలిపి రూ. 2. 40కోట్ల నిధులతో 120 మగ్గాల షెడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. చేనేతలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని, అంతరించిపోతున్న చేనేత పరిశ్రమకు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు Tue, Apr 16, 2024, 01:30 PM
గురజాల జనసేన అభ్యర్ధి వైసీపీలోకి చేరిక Tue, Apr 16, 2024, 01:27 PM
ప్రజల వద్దకే పరిపాలన తెచ్చిన నాయకుడు సీఎం జగన్ Tue, Apr 16, 2024, 01:26 PM
సునీత చెప్పేవన్నీ అబద్దాలే Tue, Apr 16, 2024, 01:25 PM
కొనసాగుతున్న మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర Tue, Apr 16, 2024, 01:25 PM