బంపర్ ప్యాకేజీ కొట్టేసిన నెల్లూరు జిల్లా విద్యార్థి ,,,ఏకంగా ఏడాదికి రూ.1.2 కోట్లతో కొలువు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:35 PM

విద్యతోనే పురోగతి సాధ్యమని ఆచరణలో నిరూపించాడు ఓ సాధారణ రైతు బిడ్డ కుమారుడు. ఏడాదికి భారీ ప్యాకేజీ జీతంతో ఉద్యోగం సంపాదించాడు. ఏకంగా ఏడాదికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాత జంగాలపల్లికి చెందిన చిన్నకారు రైతు ఈగ మురళీమనోహర్‌రెడ్డి- లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకటసాయికృష్ణారెడ్డి. చదువుల్లో బాగా రాణించాడు.. మంచి మార్కులు పొందారు. సాయికృష్ణారెడ్డి ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఈసీఈ చదువుతుండగా.. ఏకంగా 92% మార్కులు వచ్చాయి.


నాలుగో ఏడాదిలో ఉండగానే.. ఇంటెల్‌ సంస్థలో కొలువు సాధించారు వెంకటసాయికృష్ణారెడ్డి. ఇటీవల ఖరగ్‌పూర్‌ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఏడాదికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. కుమారుడికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణ రైతు కుటుంబం నుంచి వెళ్లి ఉన్నతస్థాయికి వెళ్లబోతున్న సాయికృష్ణారెడ్డిని స్థానికులు అభినందించారు.


 

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM