ఆ రెండు పార్టీలు విడిగా పోటీచేస్తే ప్రజలే నిలదీస్తారు: ఎంపీ రఘురామకృష్ణ రాజు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:35 PM

జనసేన పార్టీ, టీడీపీలు విడివిడిగా అంటే ప్రజలు ఒప్పుకోరని ఎంపీ రఘురామకృష్ణ రాజు  పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు కలిసిపోయారు.. విడిగా పోటీచేస్తే ఊరుకోరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ (లను నిలదీస్తారన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని.. వైఎస్సార్‌సీపీకి చాలా దారుణమైన పరాజయం ఎదురవుతుంది అన్నారు. 


రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందని చెబుతూనే.. తన దగ్గర లేటెస్ట్ సర్వే డేటా ఉందని ఎంపీ రఘురామకృష్ణ రాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చెప్పుకొచ్చారు. లెక్కలు లేకుండా తాను మాట్లాడనని.. ఈసారి ఎన్నికల్లో విడివిడిగా కాదు.. జనసేన పార్టీ, టీడీపీలు కలిసే పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సర్వే అంటూ కీలక అంశాలను ప్రస్తావించారు. జనసేన, టీడీపీల మధ్య పొత్తు ఉంటుందని ఎప్పటి నుంచో చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు.


దీన్ని ఎలా ఎదుర్కోవాలని విశ్వప్రయత్నాలు చేస్తారన్నారు. తన సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలకు కలిపి తక్కువలో తక్కువ 145 సీట్లు వస్తాయని లెక్కలు చెప్పారు. వైఎస్సార్‌సీపీకి 30 సీట్లు వస్తాయని అంచనా వేశారు. బీజేపీ కూడా జనసేన, టీడీపీలతో కలిసే అవకాశం ఉంది అన్నారు. బీజేపీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నానని.. ఎవరైనా 150 సీట్లు వచ్చేవాళ్లతో పొత్తు పెట్టుకుంటారు కానీ.. 20 సీట్లు వచ్చేవారితో పెట్టుకోరన్నారు. అయితే రఘురామ చెప్పిన లెక్క ప్రకారం వైఎస్సార్‌సీపీకి 2019లో 151 సీట్లతో పోలిస్తే.. ఈసారి తగ్గినట్లే అనే టాక్ వినిపిస్తోంది.


అంతేకాదు గతవారం రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, జనసేన కూటమి చెప్పలేనంత మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ పార్టీలకు 12% నుంచి 14% ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అన్నారు. ఇటీవల తాను ప్రాంతాల వారీగా ఫ్లాష్ సర్వే నిర్వహించినట్లు కొన్ని లెక్కల్ని వివరించారు. రాయలసీమ ప్రాంతలోని.. కడప చిత్తూరులలో 6% నుంచి 8%.. అనంతపురం, కర్నూలులలో 10% నుంచి 12%శాతం టీడీపీ, జనసేన కూటమికి ఎడ్జ్ ఉందని చెప్పుకొచ్చారు.


అలాగే ఉభయగోదావరి జిల్లాలలో 14% నుంచి 16%శాతం.. కృష్ణా, గుంటూరు జిల్లాలలో 12% నుంచి 14%.. ఒంగోలు నెల్లూరులలో 8% నుంచి 10%.. ఉత్తరాంధ్రలో 10% నుంచి 12% టీడీపీ, జనసేనలకు ఎడ్జ్ ఉంటుందన్నారు. ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే ఘన విజయం ఖాయమన్నారు. మళ్లీ ఇప్పుడు వచ్చే ఎన్నికలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. జనసేన పార్టీ, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని చాలా రోజులుగా చెబుతున్నారు.


 

Latest News

 
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM
వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగభూషణ Thu, Apr 25, 2024, 12:09 PM
కొనసాగిన నామినేషన్ల పర్వం Thu, Apr 25, 2024, 12:06 PM
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM