అర్హులందరికీ సంక్షేమ పథకాలు

by సూర్య | Thu, Nov 24, 2022, 04:00 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ అన్నారు. లావేరు మండలం వెంకటాపురం పంచాయతీ వెంకటపురం గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆయనకు స్థానిక వైసీపీ నేతలు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Latest News

 
సీఎం జగన్ వితరణ...బాలుడి ఆరోగ్యానికి భరోసా Fri, Dec 02, 2022, 11:48 PM
ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు చెక్...వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ Fri, Dec 02, 2022, 11:46 PM
ఏపీ రైతులకు వర్షాల భయం..అలా వస్తే తమకు నష్టమేనన్న ఆందోళన Fri, Dec 02, 2022, 11:46 PM
మార్కెట్ విలువలో ఏ కంపెనీ ఏ స్థానంలో నిలిచిందో తెలుసా Fri, Dec 02, 2022, 11:45 PM
మధ్యాహ్న భోజనం కల్తీ....40 మంది విద్యార్థులకు అస్వస్థత Fri, Dec 02, 2022, 10:39 PM