వేరే కులం వ్యక్తితో ప్రేమ.. కూతుర్ని చంపిన తల్లి

by సూర్య | Thu, Nov 24, 2022, 02:05 PM

తమిళనాడులో బుధవారం దారుణం జరిగింది. వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే ఆగ్రహంతో ఓ మహిళ తన కూతుర్ని కొట్టి చంపింది. తిరునల్వేలి జిల్లాలోని సివల్పేరి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఆరుముగ కని, పిచ్చయ్‌ దంపతుల కూతురు అరుణ అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు వేరే కులం వాడు కావడంతో వారి ప్రేమకు అరుణ తల్లి అడ్డుచెప్పింది. బుధవారం అరుణకు వేరే వ్యక్తితో పెళ్లిచూపులు ఏర్పాటు చేయగా, అరుణ అందరి ముందే తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది. దీంతో పెళ్లిచూపులు రద్దయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన అరుణ తల్లి అరుణను చంపి, తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM